Spiritual
రెండు రోజుల్లో వినాయక చవితి వేడుకలు. ఏటా భాద్రపద మాసం శుద్ధ చవితి అనగా భాద్రపదం నెలలో నాలుగో రోజు చవితి పండగ నిర్వహిస్తారు.
వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గజాననుడు, గణనాథుడు వంటి 108 పేర్లతో ఆయనను పిలుస్తారు.
పురాణాల ప్రకారం, వినాయకుడు మహాభారతాన్ని రాయడానికి తన దంతాన్ని విరగ్గొట్టాడు.
చంద్రుడు వెటకారంగా నవ్వడంతో శాపమిచ్చిన గణపయ్యే చంద్రుడికి శాప విమోచనం ఇచ్చాడు. చంద్రుడిని అనుగ్రహించి తర నుదిటిపై నెలవంక రూపంలో చంద్రుడిని తిలకంగా పెట్టుకున్నాడు.
విఘ్నాలను తొలగించేవాడే విఘ్నేశ్వరుడు. అంతేకాకుండా జ్ఞానం, శ్రేయస్సును అందిస్తాడు.
బొజ్జ గణపయ్య మయురేశ్వరుడు, గజాననుడు, ధూమ్రకేతువు వంటి వివిధ అవతారాలను ఎత్తాడు.
విఘ్నాధిపతి మిథున రాశితో, బుధ గ్రహంతోనూ సంబంధం కలిగి ఉన్నాడు.