ఆచార్య చాణక్య తన నీతిలో 5 పరిస్థితుల గురించి చెప్పారు. ఈ పరిస్థితులను ఎదుర్కొన్న వారికి బతికి ఉన్నప్పుడే చావు అనుభూతి కలుగుతుందట. అవేమిటో తెలుసుకుందాం.
Telugu
దరిద్రంలో బతకడం
కడు పేదవాడికి జీవితం శాపంలా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి బతికి ఉన్నప్పుడే చావు కష్టాన్ని అనుభవిస్తాడు. చావే అతనికి మోక్షం అని భావిస్తాడు.
Telugu
మళ్లీ మళ్లీ అవమానం భరించడం
ఎవరైనా పదే పదే అవమానాలకు గురవుతుంటే అది చావు కంటే భయంకరమైనది. ఎందుకంటే అలాంటి వారికి ఆత్మగౌరవం ఉండదు. ఈ పరిస్థితి కూడా వారికి చావుతో సమానం.
Telugu
చెడ్డ యజమాని వద్ద ఉద్యోగం
మీ యజమాని కుళ్లు, కుతంత్రాలు కలిగిన వ్యక్తి అయితే అతని దగ్గర పని చేయడం ప్రతి రోజు చస్తూ బతకడం లాంటిది. ఎందుకంటే అలాంటి యజమానులు తమ ఉద్యోగులతో చాలా నీచంగా ప్రవర్తిస్తారు.
Telugu
ప్రియమైన వారిని కోల్పోవడం
ప్రాణాలకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కోల్పోతే అది చావుతో సమానం. అలాంటి వారు చాలా కాలం పాటు ఆ వ్యక్తిని తలుచుకుంటూ బాధపడుతుంటారు.
Telugu
రుణం తీర్చలేకపోవడం
ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోతే అప్పిచ్చిన వారు అందరి ముందు మిమ్మల్ని అవమానించడం ఖాయం. ఈ పరిస్థితి చావు కంటే దారుణం.