విదురుడు మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో ఒకరు. తన నీతిలో 5 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. వారు తమ అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే చనిపోతారని వివరించారు.
Telugu
లోభి ఎక్కువ కాలం బ్రతకడు
ప్రతి విషయంలో పిసినారిగా ఉండే వ్యక్తి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. అవసరానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా చిక్కుల్లో పడతాడు. ఇలాంటి తప్పులు అతనికి మరణానికి కూడా కారణమవుతాయి.
Telugu
కోపిష్టి కూడా త్వరగా చనిపోతాడు
చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వ్యక్తి జీవితకాలం కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే కోపంలో అతను ఏదో ఒక ప్రాబ్లమ్ లో చిక్కుకుంటాడు. అది అతని మరణానికి కారణం అవుతుంది.
Telugu
చట్టాన్ని ఉల్లంఘించేవాడు
చట్టంపై భయం లేని వ్యక్తి ఒకరోజు పెద్ద నేరం చేస్తాడు. ఈ నేరమే అతని జీవితానికి అంతం అవుతుంది. అందుకే చట్టాన్ని గౌరవించాలి.
Telugu
అహంకారి కూడా త్వరగా చనిపోతాడు
అహంకారం వల్ల తెలివి నాశనమవుతుంది. అహంకారం వల్ల ఏది కరెక్ట్, ఏది తప్పు అనే విశ్లేషణ లేక కష్టాలు కొని తెచ్చుకుంటాడు. ఇదే ఆ మనిషి నాశనానికి కారణం అవుతుంది.
Telugu
ధన ప్రదర్శన చేసేవాడు
తమ డబ్బును ఎక్కువగా ప్రదర్శించేవారు కూడా త్వరగా చనిపోతారు. ఎందుకంటే అలాంటి వారిపై దొంగల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం అతనిపై దాడులు జరిగే అవకాశాలుంటాయి.