Relations

ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే

డబ్బు గురించే ఆలోచన

మీ అత్తగారు ప్రతి విషయంలోనూ డబ్బులు, బహుమతుల గురించి లెక్కలు వేయడం, పుట్టింటి నుంచి మీరు ఏం తెస్తున్నారనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది అంటే వారు పిసినారి అనే అర్థం.

 

 

పుట్టింటి నుంచి ఖరీదైన కానుకలు ఆశిస్తుంటే...

పెళ్లయ్యాక కూడా మీ అత్తగారు మీ పుట్టింటి నుంచి ఎక్కువ బహుమతులు, డబ్బు ఆశిస్తే అది పిసినారితనానికి నిదర్శనం. ఆమె సంబంధాల కంటే వస్తువులకే ఎక్కువ విలువ ఇస్తుంది.

అన్నీ తన పేరు మీద రాయించుకోవాలని చూస్తుంటే...

కొంతమంది అత్తలు తమ కొడుకు సంపాదన, ఇల్లు, నగలు, చివరికి కోడలి డబ్బును కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారు. మీ అత్తగారు కూడా ఇలా చేస్తే జాగ్రత్తగా ఉండండి.

ఇతరులతో పోల్చి కోడలిపై ఒత్తిడి తెస్తుంటే...

పిసినారి అత్తలు తరచుగా ఇతరుల కుటుంబాలతో పోల్చి తమ కోడలిపై ఒత్తిడి తెస్తారు. ఇతరుల కోడళ్లు ఎక్కువ కట్నాలు తెచ్చారని దెప్పిపొడుస్తూ ఉంటారు.

కోడలి సంపాదనపై హక్కు చెలాయిస్తుంటే...

మీ అత్తగారు కోడలి జీతంపై తనకు పూర్తి హక్కు ఉందని, ఆమె తన సంపాదనను తన ఇష్టం ప్రకారం ఖర్చు చేయకూడదని భావిస్తే, అది ఆమె పిసినారితనాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

పెళ్లి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

Chanakya Niti: భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!

Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ 4 పనులు అస్సలే చేయొద్దు!

విరాట్, అనుష్కల నుంచి భార్యభర్తలు నేర్చుకోవాల్సినది ఇదే