pregnancy & parenting
నేటి కాలం లైఫ్ స్టైల్ కారణంగా యువత లో మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. అందుకే పేరెంట్స్ వారిని గమనిస్తూ ఉండాలి.
పిల్లలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోండి. వారు తమ భావాలను చెప్పుకునే వాతావరణం కల్పించండి.
ఇంట్లో ప్రేమ, ఆదరణ వాతావరణం కల్పించండి. వారి విజయాలను ప్రశంసిస్తూ, ప్రోత్సహించండి.
చదువు, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం నేర్పండి. శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లల ఫోన్ చూసే సమయాన్ని నియంత్రించండి. వారితో ఎక్కువగా మాట్లాడండి.
మీ పిల్లల్లో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, నిపుణుల సలహా తీసుకోండి. సరైన సమయంలో సలహా పిల్లల మనోబలాన్ని పెంచుతుంది.