pregnancy & parenting

ప్రెగ్నెన్సీ టైమ్ లో మందు, సిగిరెట్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?

బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం

గర్భం ధరించిన తర్వాత మద్యం తాగితే మద్యం రక్తం ద్వారా ప్లాసెంటాకు చేరుతుంది. అయితే అప్పటికి ఇంకా పిల్లల కాలేయం అభివృద్ధి చెందదు. కనుక పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.  

గర్భస్రావం అవ్వొచ్చు

గర్భధారణ సమయంలో మహిళ మద్యం తీసుకుంటే పిండం ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ కు గురవుతుంది. దీని కారణంగా మహిళకు గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.

పిల్లల పెదవులు పగిలిపోవచ్చు

గర్భధారణ సమయంలో సిగిరెట్ తాగితే పుట్టే బిడ్డ పెదవులు పగిలిపోయి పుట్టే అవకాశం ఉంది.  నోటికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. 

 

పిల్లల ఊపిరితిత్తులపై ప్రభావం

తల్లి ఎక్కువగా ధూమపానం చేస్తే పుట్టే బిడ్డకు ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి. దీని కారణంగా పుట్టిన కొద్దిసేపటికే బిడ్డ మరణించే ప్రమాదం ఉంది.

ఎమర్జెన్సీ డెలివరీ

గర్భం వచ్చాకా సిగరెట్ తాగడం కొనసాగిస్తే అకాల ప్రసవం జరగవచ్చు. అంటే నెలలు నిండక ముందే బిడ్డ పుట్టవచ్చు. దీని కారణంగా శిశువులో పెరుగుదల లోపాలు ఏర్పడతాయి. 

తక్కువ బరువుతో జననం

గర్భధారణ సమయంలో ధూమపానం, మద్యపానం చేయడం వల్ల సమయానికి ముందే బిడ్డ పుట్టే ప్రమాదం ఉంది. బిడ్డ బరువు కూడా తక్కువగా ఉండవచ్చు.

ఎక్టోపిక్ గర్భం

ప్రెగ్నెన్సీ టైమ్ లో మద్యం, ధూమపానం అతిగా చేస్తే ఎక్టోపిక్ గర్భం(ఫెలోపియన్ ట్యూబ్‌లో) వచ్చే అవకాశం పెరుగుతుంది. దీని వల్ల బిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

Find Next One