తేనె రాస్తే మాటలు వస్తాయని నమ్మి అందరూ పిల్లలకు పెడుతూ ఉంటారు. కానీ ఆరు నెలల పిల్లలకు తేనె పెట్టడం విషంతో సమానం.
ఉప్పు
పిల్లలకు అందించే ఆహారంలో ఉప్పు చేరుస్తూ ఉంటారు. కానీ ఉప్పు పిల్లల మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. చర్మం పొడిబారడం, దాహార్తి పెరిగేలా చేస్తుంది.
పంచదార
చక్కెర కలిపిన పెరుగు, చక్కెర కలిపిన పాలు 6 నెలల నుండి 24 నెలల వయస్సు గల శిశువులకు ఇవ్వకండి. ఇది పిల్లలకు హాని కలిగిస్తుంది.
ఆవు పాలు
6 నెలల లోపు శిశువులకు ఆవు పాలు ఇవ్వడం కూడా ప్రమాదకరం. దీనివల్ల పిల్లల పేగుల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించండి.
చేపలు
శిశువు 6 నెలల వయస్సు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఘన ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తారు. చిన్న పిల్లలకు ఎప్పుడూ చేపలు ఇవ్వకండి ఎందుకంటే వాటిలో పాదరసం ఉంటుంది.
బయటి జ్యూస్ లు
బయట దొరికే టెట్రా ప్యాకెట్ జ్యూస్ లు కూడా పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. వీటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.
కాఫీ, టీలు
పిల్లలకు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు వారికి టీ ఇవ్వడం ప్రారంభిస్తారు, ఇది తప్పు. కెఫీన్ పానీయాలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.