pregnancy & parenting

పిల్లలు చాయ్ తాగితే ఏమౌతుందో తెలుసా

కెఫీన్

టీలో  కెఫీన్ ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల నిద్రలేమి,రక్తపోటు, యాంగ్జైటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

దంత సమస్యలు

టీ తాగడం వల్ల పిల్లల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే తీపివల్ల దంత క్షయం, కుహరం సమస్యలు కూడా వస్తాయి.

డీహైడ్రేషన్

టీని ఎక్కువ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఎందుకంటే కెఫీన్ వల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది. దీంతో శరీరంలో నీళ్లు తగ్గుతాయి. 

సెన్సిటివిటీ , అలెర్జీ

కొంతమంది పిల్లలకు టీ తాగడం వల్ల సెన్సిటివిటీ లేదా అలెర్జీ వస్తుంది. ఎందుకంటే టీలో టానిన్ ఉంటుంది. ఇది చాలా మంది పిల్లలలో అలెర్జీకి కారణమవుతుంది.

పోషకాల లోపం

ప్రతిరోజూ టీ తాగడం వల్ల ముఖ్యంగా పాలు, చక్కెర కలిపిన టీ ని తాగితే పిల్లల్లో పోషకాల లోపం ఏర్పడుతుంది.

మందులతో రియాక్షన్

టీలో ఉండే కేటెచిన్ రక్తాన్ని పలుచగా చేసే మందులతో చర్య జరుపుతుంది, దీనివల్ల దాని వాటి ప్రభావం తగ్గుతుంది. ఇది పిల్లలకు మంచిది కాదు. 

మానసిక వికాసాన్ని తగ్గిస్తుంది

కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏకాగ్రత, దృష్టి తగ్గుతాయి. అలాగే జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది.

యాసిడిటీ సమస్య

పిల్లలకు టీ తాగిస్తే వారికి కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. దీనివల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. 

వ్యసనం

టీ ఒక వ్యసనంలా మారుతుంది. దీన్ని ఎక్కువ కాలం తీసుకుంటే పిల్లలు దానికి బానిసలు కావొచ్చు. అలాగే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.

బరువును తగ్గించే పప్పులు ఇవి..!

వర్షాకాలంలో పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండటానికి ఏం చేయాలి?

పిల్లల్ని దోమల నుంచి ఎలా కాపాడాలంటే?