పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు. మరి ఎలా ఇస్తే తింటారో ఇక్కడ చూద్దాం.
పిల్లలకు ఇష్టమైన బొమ్మల ఆకారంలో కూరగాయలను కట్ చేసి అమర్చాలి.
స్టార్స్, హార్ట్ షేప్, స్మైలీ ఫేస్ వంటి ఆకారాల్లో కూరగాయలను అమర్చాలి.
పిల్లలకు ఇష్టమైన ఆహారాల్లో కూరగాయలను పెట్టి ఇవ్వండి. దోశ, చపాతీ, ఇడ్లీ వంటివి ఇచ్చేటప్పుడు కూరగాయలు ఇవ్వచ్చు.
స్ప్రింగ్ రోల్స్, రోటీ రోల్స్ వంటి వాటిలో కూరగాయలు కలిపి ఇవ్వండి.