Coconut Water: గర్భిణీలు రోజూ కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా ?
pregnancy-parenting Jun 26 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
రిఫ్రెష్ డ్రింక్
కొబ్బరి నీటిలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో వచ్చే అలసట, నీరసాన్ని పోగొట్టి రిఫ్రెష్ చేస్తాయి.
Image credits: freepik
Telugu
వికారం, వాంతులకు చెక్
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో వికారం, వాంతులకు తగ్గిస్తాయి. అలాగే, నిర్జలీకరణకు చెక్ పెడుతుంది.
Image credits: social media
Telugu
జీర్ణక్రియ
గర్భధారణ సమయంలో రోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Image credits: freepik
Telugu
ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా
కొబ్బరి నీటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, నిర్జలీకరణాన్ని నివారిస్తాయి.
Image credits: our own
Telugu
రక్తపోటు అదుపులో
కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి, గర్భధారణ సమయంలో అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
Image credits: our own
Telugu
తల్లి, బిడ్డకి మేలు
కొబ్బరి నీటిలోని పోషకాలు తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తాయి. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు సహాయపడతాయి.
Image credits: our own
Telugu
రోగనిరోధక శక్తి
కొబ్బరి నీళ్ళలో లారిక్ ఆమ్లం ఉంటుంది, ఇది యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.