pregnancy & parenting
తల్లిదండ్రులు చేసే పనులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి కానీ వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసేవిగా ఉండకూడదు. కానీ పేరెంట్స్ చేసే కొన్ని పనులు పిల్లల మనసులను బాధపెడతాయి. అవేంటంటే?
భార్యాభర్తలన్నాక కొట్లాడుకోవడం చాలా సహజమే కానీ పిల్లల ముందు గట్టిగట్టిగా అరుస్తూ కొట్లాడుకుంటే వారు భయపడతారు.అలాగే ఆందోళన చెందుతారు. అందుకే పిల్లల ముందు పేరెంట్స్ గొడవ పడకూడదు.
పిల్లల ముందు పేరెంట్స్ ఒకరినొకరు అవమానించుకోవడం కూడా చేయకూడదు. ఎందుకంటే వారు కూడా మీలాగే తయారవ్వొచ్చు. అంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఇతరుల్ని అవమానించే అవకాశం ఉంది.
పిల్లలు తల్లిదండ్రులను చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులే ఎక్కువ సేపు ఫోన్, ల్యాప్ టాప్, టీవీ చూస్తున్నట్టైతే.. మీ పిల్లలు కూడా చూస్తారు.
చాలా మంది భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత వేర్వేరు గదుళ్లో పడుకుంటుంటారు. పిల్లల్ని పట్టించుకోరు. కానీ దీనివల్ల మీ పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. మీరు విడిపోతారేమోనని భయపడతారు.
కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఏం చేసినా.. వారిని తిడుతూనే ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ పిల్లలు మీకు ఏదీ చెప్పుకోరు. ఏం చేసినా, చెప్పినా తిడతారని అనుకుంటారు.
పెద్దల సమస్యల గురించి పిల్లల ముందు గొడవ పడటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాటిని పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోలేరు. దీంతో వారు ఒత్తిడికి లోనవుతారు.
పిల్లల ముందు స్మోక్ చేయడం, మందు తాగడం వంటివి చేయకూడదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా మీలాగే చేసే అవకాశం ఉంది. పిల్లలు తల్లిదండ్రుల అలవాట్లను కాపీ ఎక్కువగా కొడతారు.