pregnancy & parenting
బర్రెపాలు చాలా చిక్కగా ఉంటాయి. ఈ పాలలో ప్రోటీన్లు, కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఆవుపాలు చిన్నపిల్లలకు చాలా సులువుగా జీర్ణమవుతాయి.
బర్రెపాలలో ఆవుపాల కంటే 3-4% కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో బర్రెపాలు చాలా చిక్కగా ఉంటాయి. కానీ ఈ పాలను తాగితే బరువు పెరుగుతారు. జీర్ణ సమస్యలు వస్తాయి.పిల్లలకు ఆవు పాలే మంచివి.
ప్రోటీన్లు, కాల్షియం బెర్రపాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఆవుపాలే రోజు తాగడానికి మంచివంటారు ఆరోగ్య నిపుణులు.
బర్రెపాలలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ మన కళ్లను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆవుపాలు, బర్రెపాలలో ఉండో విటమిన్ డి కాల్షియం శోషణకు అవసరం.
ఆవుపాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పాలు సులువుగా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపు నొప్పి రాదు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆవుపాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలున్నవారికి ఆవుపాలే మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆవుపాల కంటే బర్రెపాలే చిక్కగా, టేస్టీగా ఉంటాయి. అందుకే కొంతమంది పిల్లలు బర్రెపాలనే ఎక్కువగా తాగుతారు. కానీ పిల్లలకు ఆవుపాలే మంచివి.