pregnancy & parenting
అంబానీ కుటుంబం చదువు, వ్యక్తిగత అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది. చదువుతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాముఖ్యత ఇస్తారు. పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించారు.
నీతా , ముఖేష్ అంబానీ తమ పిల్లలకు ఆధునిక ఆలోచనతో పాటు సాంప్రదాయ విలువలను గౌరవించడం నేర్పించారు. ఎంత ఎదిగిన మూలాలు మర్చిపోకూడదు అనేది అంబానీ సిద్ధాంతం
అంబానీ దంపతులు తమ పిల్లలకు నిజాయితీ, కష్టపడి పనిచేయడం నేర్పించారు అంబానీ కుటుంబంలో పిల్లల వ్యక్తిత్వం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని ముకేష్, నీతా భావించేవారట.
అంబానీ కుటుంబం పిల్లలు తమ ఆలోచనలు , చింతలను సంకోచం లేకుండా పంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది.
వారు పిల్లలకు జీవితంలో కుటుంబం , వృత్తిపరమైన సంబంధాలలో జట్టుకృషి ప్రాముఖ్యతను నేర్పుతారు. ఇది ఐక్యతను పెంపొందించడమే కాకుండా, బాధ్యత, సహకార భావనను కూడా అభివృద్ధి చేస్తుంది.
నీతా , ముఖేష్ అంబానీ తమ పిల్లలు విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని సహించరు.తమ పిల్లలు ఏదైనా ప్రేమతో నేర్చుకునేలా ప్రోత్సహించారు.
అంబానీ కుటుంబం తమ పిల్లలను సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తారు. ఇది వారికి దానధర్మాలు, పరోపకారం , సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను నేర్పుతుంది.
నీతా ,ముఖేష్ తమ బిజీ షెడ్యూల్ తర్వాత కూడా పిల్లల కార్యకలాపాలలో పాల్గొంటారు. వారు పిల్లల అభిరుచికి మద్దతు ఇస్తారు