మీరు పాజిటివ్ పేరెంట్సేనా..? ఇవి ఫాలో అవుతున్నారా?
pregnancy-parenting Jul 24 2025
Author: ramya Sridhar Image Credits:Freepik
Telugu
వినడం అలవాటు చేసుకోండి..
పిల్లలు తమ మాట వినాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ, ముందు పిల్లలు ఏం చెబుతున్నారో వినడం అలవాటు చేసుకోవాలి. వారు ఏదైనా మీతో చెప్పాలి అనుకున్నప్పుడు మీరు అడ్డు పడకూడదు.
Image credits: Freepik
Telugu
పాజిటివ్ పేరెంటింగ్ అంటే..
పాజిటివ్ పేరెంటింగ్ అంటే క్రమశిక్షణ లేకపోవడం కాదు. పిల్లల వయస్సుకు తగిన బౌండరీస్ నియమించాలి. పిల్లలకు భద్రత కల్పించాలి.
Image credits: Freepik
Telugu
బహుమతులు ఇవ్వండి..
పిల్లలు మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడు వారిని పొగడటం, వారికి మంచి బహుమతులు ఇవ్వడం లాంటివి చేయాలి. దీని వల్ల.. వారు మంచి ప్రవర్తనను అలవాటు చేసుకుంటారు.
Image credits: Freepik
Telugu
రోల్ మోడల్ లా ఉండాలి..
పిల్లలు మీరు చెప్పేదానికంటే మీరు చేసేదాని నుండి ఎక్కువ నేర్చుకుంటారు. మీ పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా మీరు ఉండాలి. మీరు పిల్లలకు మంచి రోల్ మోడల్ గా మారాలి.
Image credits: Freepik
Telugu
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి..
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, వారిని తిట్టకుండా, దాని వెనక కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు పిల్లల సమస్యను పరిష్కరించగలరు.
Image credits: Freepik
Telugu
పరిష్కారాలు కనుగొనడం..
తప్పులను శిక్షించడానికి బదులుగా, పరిష్కారాలను కనుగొనడంలో మీ పిల్లలకు మార్గనిర్దేశం చేయండి. ఇది వారిని విమర్శనాత్మకంగా ఆలోచించడానికి స్వతంత్రంగా మారడానికి వారికి శక్తినిస్తుంది.
Image credits: Freepik
Telugu
పిల్లలకు అండగా ఉండాలి..
మీ పిల్లవాడు ఏ సమస్యతోనైనా మీ వద్దకు రావడానికి సురక్షితంగా భావించాలి. మీతో ఏదైనా షేర్ చేసుకునేలా ఉండాలి. అందుకు మీరు అండగా ఉండాలి