Telugu

పిల్లలతో తల్లిదండ్రులు ఇలాగే ఉండాాలి

Telugu

ప్రేమగా చూసుకోండి

పిల్లలు చాలా విషయాల్లో మారాం చేస్తుంటారు. స్కూలుకు వెళ్లనని, హోం వర్క్ చేయనని  పిల్లలు మారాం చేయడం కామన్. ఇలాంటప్పుడు కోపిగించుకోకుండా ప్రేమగా చెప్పండి. మాట వింటారు.

Image credits: pinterest
Telugu

సమస్యలున్నాయేమో అడగండి

చెప్పుకోరు కానీ స్కూల్ కి వెళ్లే పిల్లలకు కూడా సమస్యలుంటాయి. అవి ఎలాంటివైనా కావొచ్చు. కాబట్టి వారిని దగ్గర కూర్చోబెట్టుకుని అడగండి. 

Image credits: pinterest
Telugu

మాట్లాడండి

చాలా మంది తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్ వల్ల పిల్లలతో సరిగ్గా మాట్లాడరు. దీనివల్ల మీ పిల్లల లక్ష్యాల గురించి మీకు ఏం తెలియదు. కాబట్టి మీ పిల్లలతో రోజూ ఖచ్చితంగా మాట్లాడండి. 

Image credits: pinterest
Telugu

ప్రోత్సహించండి

మీ పిల్లలు ఏ చిన్న మంచి పని చేసినా ప్రోత్సహించడం నేర్చుకోండి. ముఖ్యంగా మంచి మార్కులు తెచ్చుకున్నా, మంచిగా ప్రవర్తించినా బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయండి. 

Image credits: unsplash
Telugu

స్నేహితులుగా ఉండండి

పిల్లలతో స్నేహితులుగా ప్రవర్తిస్తే వారు మీకెన్నో విషయాలు చెప్తారు. ఇందుకోసం మీరు వారితో ఆడుకోవడం, బొమ్మలు గీయడం చేయొచ్చు. .

Image credits: unsplash
Telugu

కొంత సమయాన్ని గడపండి

మీకు తెలుసా? మీ పిల్లలతో మీరు కొంతసమయాన్ని గడిపితే ఖచ్చితంగా వారి ఇష్ట ఇష్టాలను తెలుసుకోగలుగుతారు. 

Image credits: unsplash
Telugu

క్రమ శిక్షణ

పిల్లలకు క్రమశిక్షణ ఖచ్చితంగా నేర్పాలి. ఇందుకోసం వారిని తిడుతూ, కొడితే మాత్రం వారికి మీరంటే ఇష్టం లేకుండా అవుతుంది. అలాగే మీరంటే ద్వేషం, కోపం కలుగుతాయి. 

Image credits: unsplash

పిల్లల బ్రెయిన్ కంప్యూటర్ లా పనిచేయాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!

పిల్లలు మానసికంగా దృఢంగా పెరగాలా? పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?

మీరు పాజిటివ్ పేరెంట్సేనా..? ఇవి ఫాలో అవుతున్నారా?

Parenting Tips: పిల్లలు కూరగాయలను ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో తెలుసా?