Telugu

పిల్లలు అన్ని కూరగాయలు తినాలంటే ఏం చేయాలి?

Telugu

తల్లిదండ్రులు చేయాల్సింది

పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు పిల్లలకు కూరగాయలు ఏ విధంగా ఇచ్చి ప్రయత్నించినా, వారు తినడానికి ఇష్టపడరు. 
 

Telugu

పిల్లలకు కూరగాయలు ఇవ్వడం ఎలా

పిల్లలకు కూరగాయలు ఇవ్వడం ఎలాగో శిశువైద్యుడు డాక్టర్ రవి మాలిక్ చెబుతున్నారు. 
 

Telugu

కార్టూన్

పిల్లలకు ఇష్టమైన కార్టూన్ పాత్రలతో కూరగాయలను కట్ చేసి ఇవ్వండి. లేదంటే వారికి నచ్చిన వారు ఇవి తింటారని చెప్పాలి , ఉదాహరణకు, పాలకూర తింటే సూపర్ హీరో అవుతారని చెప్పి ఆహారం ఇవ్వండి.

Telugu

ఆకట్టుకునే షేప్స్

నక్షత్రాలు, హృదయాలు లేదా నవ్వుతున్న ముఖాలు వంటి కట్టర్లను ఉపయోగించి కూరగాయలను ఆసక్తికరమైన ఆకారాలుగా మార్చడం వల్ల పిల్లలు కూరగాయలు తినడానికి ఆసక్తి చూపిస్తారు.

Telugu

కనపడకుండా ఇవ్వండి

 ఇష్టమైన ఆహారాలలో కూరగాయలను వారికి కనిపించకుండా ఇవ్వండి. దోశ, చపాతీ, ఇడ్లీ వంటివి ఇచ్చేటప్పుడు కూరగాయలను పేస్టు చేసి కలిపేయండి.

Telugu

స్ప్రింగ్ రోల్స్..

స్ప్రింగ్ రోల్స్, రోటీ రోల్స్ వంటి వాటిలో కూరగాయలు కలిపి ఇవ్వండి. ఇది వారు సులభంగా తింటారు. 

Telugu

పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయండి..

ఆహారం వండేటప్పుడు పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయండి. పిల్లలను వంటలో భాగస్వామ్యం చేయడం వల్ల వారికి ఆసక్తి కలుగుతుంది.
 

పిల్లల్ని తోటి పిల్లలతో అస్సలు పోల్చకూడదు? ఎందుకంటే..

పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, ఓపికగా ఉండటమెలా?

Parenting: పేరెంట్స్ నుంచి పిల్లలు ఏం కోరుకుంటారో తెలుసా..?

మంచు బిందువుల్లాంటి మీ పిల్లలకు 8 అందమైన పేర్లు ఇవిగో