pregnancy & parenting
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేండ్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినకూడదంటే వారికి కొన్ని ఆహారాలను అస్సలు తినిపించకూడదు. అవేంటంటే?
పిల్లలకు కాఫీని పొరపాటున కూడా తినిపించకూడదు. ఎందుకంటే ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే పిల్లలకు నిద్రపట్టకుండా చేసి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
పిల్లలకు పొరపాటున కూడా ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినిపించకూడదు. ఎందుకంటే దీనిలో ప్రిజర్వేటివ్స్, సోడియం, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
పిల్లలకు బయటదొరికే జ్యూస్, సోడా లాంటివి అస్సలు తాగించకూడదు. ఎందుకంటే ఇవి పిల్లల బరువును పెంచుతాయి. అలాగే దంతక్షయాన్ని కలిగిస్తాయి. వీటిలో కేలరీలు తప్ప పోషకాలనేవే ఉండవు.
కృత్రిమ తీపి పదార్థాలను పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి పిల్లల జీవక్రియను దెబ్బతీసి వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి.
పిల్లలకు వేపుళ్లను అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వీటిని చెడు నూనెలోనే వండుతారు. ఇవి తింటే పిల్లల్లో ట్రాన్స్ ఫ్యాట్ పెరిగి జబ్బులు వచ్చేలా చేస్తాయి.
ఎంత టేస్టీగా ఉన్నా సరే పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ ను పెట్టకూడదు. ఎందుకంటే వీటిలో సోడియం, షుగర్, బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల బరువును పెంచి ఎన్నో రోగాల బారిన పడేస్తాయి.
పిల్లలకు బిస్కెట్స్, చిప్స్, కుక్కీస్ వంటి స్నాక్స్ ను అస్సలు పెట్టకూడదు. వీటిలో షుగర్, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పిల్లల బరువును పెంచి పోషకాల లోపాన్ని కలిగిస్తాయి.
పిల్లలకు మిఠాయిలు కూడా మంచివి కావు. ఎందుకంటే వీటిలో కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.