pregnancy & parenting

వర్షాకాల వ్యాధులు

వర్షాకాలంలో ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు చాలా త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది.
 

Image credits: Getty

పిల్లలపై ఎక్కువ శ్రద్ధ

వర్షాకాలంలో తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంటే వారు తినే ఆహారం, ధరించే దుస్తుల విషయంలో కేరింగ్ తీసుకోవాలి. 

Image credits: Getty

సంక్రమణ

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్లే పిల్లలకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. 
 

Image credits: Getty

గొడుగు, రెయిన్ కోట్

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రెయిన్ కోట్ ను పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత తడి బట్టలను తీసేసి కాటన్ దుస్తులను వేయాలి. 
 

Image credits: Getty

దోమల తెర

వర్షాకాలంలో దోమల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందుకే పిల్లలకు దోమలతెరలు ఖచ్చితంగా వేయాలి. అలాగే వదులుగా ఉండే ఫుల్ హ్యాండ్ దుస్తులు వేయాలి. 
 

Image credits: Getty

ఆరోగ్యకరమైన ఆహారం

వర్షాకాలంలో పిల్లలకు హెల్తీ ఫుడ్ ను పెట్టాలి. ఈ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అరటిపండ్లు, దానిమ్మ, బొప్పాయి వంటి సీజనల్ పండ్లను వారి ఆహారంలో చేర్చండి. 
 

Image credits: Getty

వ్యాక్సినేషన్ తప్పనిసరి

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ ను ముందు జాగ్రత్తగా తీసుకోవాలి.
 

Image credits: Getty
Find Next One