pregnancy & parenting

పిల్లలకి రోజూ స్నానం చేయించాలా

Image credits: freepik

వానకాలం, చలికాలంలో జాగ్రత్తలు

వానకాలంలో తడిబట్టలు వేసుకోవడం వల్ల చర్మం ఇన్ఫెక్షన్లు వస్తాయి. పిల్లల్ని ఈ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి వారికి ఎప్పుడూ డ్రై డ్రెస్ లను వేయాలి. 

Image credits: సోషల్ మీడియా

పిల్లల సంరక్షణ

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లలకి ప్రతిరోజూ స్నానం చేయించొచ్చు. అయితే వారి డ్రెస్ లు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. 

Image credits: సోషల్ మీడియా

వెచ్చని నీరు

ఎట్టిపరిస్థితిలో పిల్లలకు చల్లని నీళ్లతో స్నానం చేయించకూడదు. గోరువెచ్చని నీళ్లతోనే వారికి స్నానం చేయించాలి. అయితే ఈ నీళ్లలో కొంచెం యాంటీ సెప్టిక్ ను కలపండి.

Image credits: సోషల్ మీడియా

సురక్షితం అని నిర్ధారించుకోండి

యాంటీసెప్టిక్ సేఫా? కాదా? అని తెలుసుకోవడానికి ముందుగా దాన్ని మీ చేతికి అంటించుకోండి. తర్వాత దాన్ని వాటర్ లో కలిపి పిల్లలకు స్నానం చేయించండి. ఇది పిల్లల కళ్లలో పడకుండా చూసుకోండి.

Image credits: సోషల్ మీడియా

వానకాలం జాగ్రత్తలు

మీరు మీ పిల్లలకి బాత్ టబ్ లో స్నానం చేయిస్తే గనుక.. వానకాలం, చలికాలంలో అందులో పిల్లల్ని ఎక్కువసేపు ఉంచకండి.

Image credits: సోషల్ మీడియా

పిల్లల సంరక్షణ

పిల్లలకి స్నానం చేయించిన తర్వాత వారి ఒంటికి తడి లేకుండా మెత్తని టవల్ తో తుడవండి. డ్రైగా ఉన్న దుస్తులను వేయండి. 

Image credits: freepik

డైపర్లు

ఏవి పడితే ఆ డైపర్లను వేయడం మానుకోండి. మంచి నాణ్యతున్న, దద్దుర్లు రాని డైపర్లనే వాడండి. కాటన్ డైపర్లు పిల్లల చర్మానికి ఎలాంటి హాని చేయవు. 

Image credits: సోషల్ మీడియా
Find Next One