pregnancy & parenting

నాన్న మాత్రమే పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు ఇవి..!

లైఫ్ లో షార్ట్ కట్స్ ఉండవు..

జీవితంలో కష్టపడితేనే ఏదైనా సాధించగలం అని తండ్రి పిల్లలకు చెప్పాలి. ప్రతి పనిలోనూ షార్ట్ కట్స్ వెతుకుతూ వెళ్లకూడదని చెప్పాలి.

 

 

భయాలను జయించాలి..

పిల్లలు తమ భయాలను జయించి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి నాన్న ప్రోత్సహించాలి.. ఇది వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుతుంది.

బాధ్యత తీసుకోండి

తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాలని, తప్పులను సరిదిద్దుకోవాలని నాన్న పిల్లలకు నేర్పించాలి.

నిజంగా, న్యాయంగా ఆడుకోండి

ఆటల్లో నిజాయితీ, క్రీడాస్ఫూర్తి నేర్పుతారు. పోటీ పడటం సరే, కానీ గౌరవం, పరిమితులు ముఖ్యమని నాన్న తమ పిల్లలకు నేర్పించాలి.

చిన్న చిన్న పనులు నేర్పించడం

ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు, సైకిల్ రిపేర్ వంటివి నేర్పి, ఇబ్బందుల్లో సాయపడటమే కాకుండా స్వయం సమృద్ధిని పెంపొందిస్తారు.

ఓటమిని గౌరవంగా స్వీకరించడం

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని నాన్నలు నేర్పుతారు. ఆటలో ఓడిపోయినా, ప్రాజెక్ట్ లో ఫెయిల్ అయినా, అది నేర్చుకోవడానికి ఒక అవకాశం అని నాన్నలు పిల్లలకు నేర్పుతారు.

కుటుంబాన్ని కాపాడుకోవడం..

తమను తాము, తమ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాన్నలు పిల్లలకు నేర్పుతారు. నమ్మకం, నిజాయితీ, బంధాల ప్రాముఖ్యతను వివరిస్తారు.

అందరినీ గౌరవించండి

అందరినీ గౌరవించాలని నాన్నలు నొక్కి చెబుతారు. పొరుగువారితో, సహోద్యోగులతో, అపరిచితులతో ఎలా ప్రవర్తించాలో నాన్నలు పిల్లలకు ఆదర్శంగా ఉంటారు.

Find Next One