Telugu

Jason Sanjay : విజయ్ కొడుకు ఏం చదివాడు, ఇప్పుడేం చేస్తున్నాడు..?

Telugu

ఎవరీ కుర్రాడు..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ విజయం తర్వాత ఆయన వ్యక్తిగత వివరాలు తెలసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయన కొడుకు జేసన్ సంజయ్ పేరు మారుమోగిపోతోంది. 

Image credits: facebook/ActorJasonSanjay
Telugu

ఇంతకీ ఎవరీ జేసన్ సంజయ్..?

జేసన్ సంజయ్ దళపతి విజయ్ కొడుకు. అతను 2000 సంవత్సరంలో జన్మించాడు. అతని వయసు 26 ఏళ్లు. 

Image credits: facebook/ActorJasonSanjay
Telugu

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఏం చేస్తారు?

జేసన్ సంజయ్ తన తండ్రిలా నటనలో కాకుండా, ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్‌లో తన కెరీర్‌ను నిర్మించుకుంటున్నారు. చిన్నప్పుడు 2009లో వచ్చిన 'వేట్టైకారన్' సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు.

Image credits: facebook/ActorJasonSanjay
Telugu

జేసన్ సంజయ్ ఏం చదువుకున్నారు?

జేసన్ సంజయ్ తన ప్రాథమిక విద్యను చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడా, లండన్‌లలో ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్‌ కోర్సులు చేశారు. 

Image credits: facebook/ActorJasonSanjay
Telugu

జేసన్ సంజయ్ కెరీర్ ఎలా మొదలైంది?

జేసన్ సంజయ్ ఇటీవల 'సిగ్మా' అనే షార్ట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా అడుగుపెట్టారు. దీని క్రియేటివ్ కథ, సృజనాత్మకతకు మంచి ప్రశంసలు లభించాయి.
Image credits: facebook/ActorJasonSanjay
Telugu

ప్రయోగాత్మక షార్ట్ ఫిల్మ్స్‌తోనూ గుర్తింపు

జేసన్ సంజయ్ తన స్టూడెంట్ లైఫ్‌లో కూడా చాలా ప్రయోగాత్మక షార్ట్ ఫిల్మ్స్ చేశారు. 2023లో వచ్చిన "పుల్ ది ట్రిగ్గర్" అనే షార్ట్ ఫిల్మ్ బాగా పాపులర్ అయ్యింది. 

Image credits: facebook/ActorJasonSanjay

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?

ఇదేందయ్యా ఇదీ.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ మాట్లాడేవారు తక్కువా..!

భారత్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి?

అయోధ్య దీపోత్సవంలో 26 లక్షలకు పైగా దీపాల వైభవం