ఈ ఫేస్ ప్యాక్ తో ట్యాన్‌కి చెక్.. ట్రై చేసి చూడండి!
life Jul 28 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
టమాటా రసం, రోజ్ వాటర్
ఒక టమాటా తీసుకుని దాని రసం తీయాలి. ఆ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాక్‌ను ముఖం, మెడకు పట్టించాలి. కాసేపయ్యాక కడిగేయాలి.
Image credits: Getty
Telugu
శనగపిండి, పాలు
ఒక స్పూన్ శనగపిండిలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉన్న నలుపుదనం తొలగిపోతుంది.
Image credits: Getty
Telugu
కలబంద గుజ్జు, పసుపు
ఒక స్పూన్ కలబంద గుజ్జులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
Image credits: Getty
Telugu
కీర దోస రసం, రోజ్ వాటర్
కీర దోస రసం, రోజ్ వాటర్ సమపాళ్లలో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి.
Image credits: Social Media
Telugu
ఓట్స్, పెరుగు
రెండు టీస్పూన్ల ఓట్స్ పొడిలో ఒక టీస్పూన్ పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత కడిగేయాలి.
Image credits: Getty
Telugu
బొప్పాయి, బాదం నూనె
రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో ఒక టీస్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.