మాయిశ్చరైజర్ రెండుసార్లు అప్లై చేయాలి. ముందుగా తేలికపాటి క్రీమ్ లేదా జెల్-బేస్డ్ మాయిశ్చరైజర్, ఆ తర్వాత హైడ్రేటింగ్ థిక్ క్రీమ్ అప్లై చేయండి. దీనివల్ల ఫౌండేషన్ ప్యాచీగా కనిపించదు.
మీ ఫౌండేషన్ వేసుకునే ముందు, దానికి 1-2 చుక్కల ఫేస్ ఆయిల్ కలపండి. దీనివల్ల మేకప్ స్మూత్‌గా కనిపిస్తుంది. డ్రై ప్యాచెస్ మాయమవుతాయి. ఇది మేకప్ ఆర్టిస్టుల ఫేవరెట్ ట్రిక్.
చలికాలంలో మ్యాట్ ఫౌండేషన్ డల్‌గా చూపిస్తుంది. హైడ్రేటింగ్, సీరమ్ లేదా డ్యూయీ ఫౌండేషన్ ఎంచుకోండి. ఇందులో హైలురోనిక్ యాసిడ్, విటమిన్ ఇ, గ్లిజరిన్ ఉండాలి. ఇది సహజమైన గ్లో ఇస్తుంది.
ముఖం మొత్తం పౌడర్‌తో సెట్ చేయకండి. కేవలం ముక్కు, గడ్డం, నుదురు మీద మాత్రమే అప్లై చేయండి. దీనివల్ల ముఖం మ్యాట్‌గా మారదు, గ్లో అలాగే ఉంటుంది.
చలికాలంలో క్రీమ్ బ్లష్, క్రీమ్ హైలైటర్, క్రీమ్ కాంటౌర్ వాడండి. ఇవి సులభంగా బ్లెండ్ అవుతాయి, సహజమైన ఫినిష్ ఇస్తాయి. పౌడర్ ప్రొడక్ట్స్ లైన్స్‌ను, డ్రై ప్యాచెస్‌ను చూపిస్తాయి.
ఫౌండేషన్ వేసుకునే ముందు బ్యూటీ స్పాంజ్‌ను సెట్టింగ్ స్ప్రేతో తడపండి. దీనివల్ల మేకప్ మరింత ఫ్లాలెస్‌గా కనిపిస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది.
ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, మాయిశ్చరైజర్‌లో 1 చుక్క లిక్విడ్ హైలైటర్ కలపండి. దీన్ని ఫౌండేషన్‌కు ముందు అప్లై చేయండి. చర్మం లోపలి నుంచి మెరుస్తున్నట్టు సహజంగా గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.