Lifestyle
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. అలాగే ఉదయం రీఫ్రెష్ గా ఉంటారు.
మీరు ఏ పనిని క్రమం తప్పకుండా చేసినా.. దీనివల్ల మీరు మరింత కంఫర్టబుల్ గా ఉంటారు. అలాగే మీ పనిని మరింత మెరుగ్గా చేసుకోగలుగుతారు.
మనం కంటినిండా, సరిగ్గా నిద్రపోవడం వల్ల మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలు ఉండవు.
ఈ అలవాటు మీరు రోజంతా రిఫ్రెష్ గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మీ పనులను మరింత చురుగ్గా చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మీ రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడానికి నిద్ర కూడా సహాయపడుతుంది. మీరు టైం కు నిద్రపోయి త్వరగా నిద్రలేస్తే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సరైన నిద్ర విధానాలు అధిక బరువు తగ్గడానికి, వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండటానికి నిద్ర ఎంతగానో సహాయపడుతుంది.
కంటినిండా నిద్రపోవడం ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కంటి నిండా నిద్ర ఉంటే రోగాలు తొందరగా తగ్గిపోతాయి.