Lifestyle

ఈ ఆహారాలు జుట్టు రాలేలా చేస్తాయి

Image credits: Freepik

చక్కెర ఆహారాలు

చక్కెర మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. చక్కెరను మోతాదుకు మించి తింటే ఎన్నో రోగాలు వస్తాయి. జుట్టు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీటిని మితంగానే తీసుకోవాలి. 
 

Image credits: Freepik

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉండవు.ఈ ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, ఉప్పు లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలేలా చేస్తాయి. 

Image credits: Freepik

ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్

ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉండవు. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరగడం, హెయిర్ ఫాల్ సమస్యలొస్తాయి. 
 

Image credits: Freepik

మద్యం

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల తలతో సహా శరీరం మొత్తం డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేటెడ్ హెయిర్ ఫోలికల్స్ తెగిపోవడానికి, జుట్టు రాలడానికి కారణమవుతుంది. 
 

Image credits: Freepik

కెఫిన్

మితిమీరిన కెఫిన్ వినియోగం నిర్జలీకరణానికి దారితీస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు. 
 

Image credits: Freepik

విటమిన్ ఎ ఎక్కువున్న ఆహారాలు

జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఎ అవసరమే. అయితే సప్లిమెంట్స్ లేదా జంతు ఆధారిత మూలాల నుంచి దీన్ని ఎక్కువగా తీసుకోవడం జుట్టు రాలడానికి దారితీస్తుంది.
 

Image credits: Freepik

తక్కువ ప్రోటీన్ ఆహారాలు

తగినంత ప్రోటీన్ ను తీసుకోకపోవడం వల్ల జుట్టు బలహీనంగా, పెళుసుగా మారుతుంది. మాంసకృత్తులు ఎక్కువగా లేని ఆహారం వల్ల జుట్టు సన్నబడటమే కాకుండా రాలిపోయే అవకాశం కూడా ఉంది. 
 

Image credits: Freepik

ఈ మసాలా దినుసులు బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తయ్..

ఒత్తిడి లేకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు

ఈ పండ్లను పరిగడుపున తింటే మంచిది

ఈ అలవాట్లు మీ జుట్టును సిల్కీగా చేస్తాయి