Lifestyle
కొన్ని పండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల శరీర బరువు బాగా పెరుగుతుంది. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇలాంటి పండ్లను అస్సలు తినకూడదు.
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే మామిడి పండ్లలో సహజ చక్కెరలు, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరుగుతారు. అందుకే వీటిని ఎక్కువగా తినొద్దు.
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. అందుకే బాగా పండిన అరటిపండ్లను తినకండి. అలాగే ఈ పండ్లను తక్కువగానే తినండి.
ద్రాక్షలు ఎంతో రుచిగా ఉంటాయి. కానీ వీటిలో ఎక్కువ మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే విపరీతంగా బరువు పెరిగిపోతారు.
బొప్పాయి మంచి పోషకాలున్న పండు. కానీ ఈ పండులో కూడా సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గే సమయంలో ఈ పండును ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఈ పండు కూడా బరువును పెంచుతుంది.
పైనాపిల్ పండులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తింటే మీరు బరువు తగ్గే అవకాశం ఉండదు. బరువు తగ్గాలనుకుంటే పైనాపిల్ ను తక్కువగా తినండి.
చెర్రీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ ఈ పండులో ముఖ్యమైన సహజ చక్కెరలు ఉంటాయి. బరువు తగ్గేటప్పుడు కేలరీలను తగ్గించాలనుకుంటే చెర్రీలను తక్కువగా తినాలి.