Lifestyle

ఒత్తిడి లేకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు

ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించాలి.

Image credits: Freepik

ఆరోగ్యకరమైన ఆహారం

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. 
 

Image credits: Freepik

క్రమం తప్పకుండా వ్యాయామం

శారీరక శ్రమ మన మానసిక స్థితిని మెరుగ్గా ఉంచే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇందుకోసం వాకింగ్, యోగా, జాగింగ్ లేదా మీకు ఆనందం కలిగించే ఏదైనా కార్యకలాపాల్లో పాల్గొనండి.

Image credits: Freepik

మెడిటేషన్

మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి, క్షణంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాల్లో పాల్గొనండి.
 

Image credits: Freepik

సానుకూల సామాజిక సంబంధాలు

స్నేహితులు, కుటుంబ సభ్యులతో రోజూ కాస్త సమయం గడపండి. మీ ఆలోచనలను, భావాలను పంచుకోవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
 

Image credits: Freepik

అలవాట్లు, రిలాక్సేషన్

చదవడం, తోటపని చేయడం, పెయింటింగ్ వేయడం, పాటలు వినడం వంటి అలవాట్లు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందుకోసం మీకు ఇష్టమైన పనులను చేయండి.
 

Image credits: Freepik

తగినంత నిద్ర

నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. అలాగే రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోండి. నిద్ర మీ శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. చురుగ్గా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. 

Image credits: Freepik

ఈ పండ్లను పరిగడుపున తింటే మంచిది

ఈ అలవాట్లు మీ జుట్టును సిల్కీగా చేస్తాయి

రోజూ ఉదయం ఆరెంజ్ జ్యూస్ ను తాగితే ఎంత మంచిదో తెలుసా?

బీపీ ఎందుకు తగ్గుతుందంటే?