Lifestyle
అరటిపండు నేచురల్ ఎనర్జీ బూస్టర్. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. క్రీడాకారులు అరటి పండు తింటే ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది.
శరీరంలో సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్లు సమతుల్యం లేకపోతే కండరాల పట్టుకుంటాయి. అరటిపండులో పొటాషియం అధికంగా ఉండడంతో, క్రీడాకారుల కండరాలకు ఇది చాలా మంచిది.
క్రీడాకారులు ఎక్కువగా కదలాల్సి ఉంటుంది. అరటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి.
అరటి పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్‌తో పోల్చితే అరటిపండు సహజమైన చక్కెరలను అందిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటొనిన్ స్థాయిని పెంచి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
అరటి పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోస్, మాల్టోజ్ లాంటి సహజమైన చక్కెరల మిశ్రమం ఉంటుంది. ఇవి శరీరానికి మెల్లగా శక్తిని అందిస్తాయి. దీంతో ఎక్కువ సమయం అలసటకు గురికాకుండా ఉంటారు.