Lifestyle
ఎరోప్లేన్ విండోస్ ఎందుకు చిన్నగా, గుండ్రంగా ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.
1950ల ముందు విమానాల్లో కిటికీలు చతురస్రాకారంలో ఉండేవి. అయితే వీటిని గుండ్రంగా మార్చారు. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
రౌండ్ విండోస్ విమానాన్ని సురక్షితంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. విమానం ఎగురుతున్నప్పుడు గుండ్రని కిటికీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
రౌండ్ షేప్ లో ఉన్న కిటికీకి విరిగిపోయే అవకాశాలు తక్కువ. విమానం ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యం.
కిటికీలు చతురస్రాకారంలో ఉంటే వాటి పదునైన మూలల్లో ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది గాజును పగిలేలా చేస్తుంది. 1953, 1954 మధ్య మూడు ప్రమాదాల్లో ఇదే జరిగింది.
ఈ సంఘటనల తర్వాత విమానం కిటికీల ఆకారాన్ని స్వ్కేర్ నుంచి రౌండ్ షేప్ లోకి మార్చారు. గుండ్రని కిటికీలు బలంగా ఉంటాయి.