Lifestyle

ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేసే చిట్కాలు ఇవి

కాఫీ పొడి, పొగాకు

కాకాఫీ పొడిని కొద్దిగా పొగాకుతో కలిపి చిన్న బాల్స్ ను తయారుచేయండి. వీటిని ఇంటి మూలల్లో ఉంచండి. వీటి వాసనకు బల్లులో ఇంట్లో నుంచి పారిపోతాయి.చిన్న పిల్లల్ని వీటికి దూరంగా ఉంచాలి. 

గుడ్డు పెంకులు

కోడి గుడ్డు పెంకులను కిచెన్ రూం, తలుపులు, కిటికీల దగ్గర పెట్టండి. వీటి వాసనకు బల్లులు ఇంట్లో ఎక్కడున్నా పారిపోతాయి. 

వెల్లుల్లి, ఉల్లిపాయ

వెల్లుల్లి, ఉల్లిపాయ వాసన బల్లులకు అస్సలు నచ్చదు. కాబట్టి వీటిని ముక్కలను ఇంట్లో మూలల్లో పెట్టండి. దీంతో మీ ఇంట్లో ఉన్న బల్లులన్నీ పారిపోతాయి.

నెమలి ఈకలు

అవును నెమలి ఈకలతో కూడా ఇంట్లో బల్లులు లేకుండా చేయొచ్చు. ఎందుకంటే బల్లులు వీటిని చూస్తే భయపడతాయి. కాబట్టి తలుపులు, కిటికీలు లేదా కిచెన్ చుట్టూ  వీటిని పెట్టండి. 

కర్పూరం వెలిగించడం

కర్పూరం వాసన బల్లులకు అస్సలు నచ్చదు. కాబట్టి కర్పూర కాల్చండి. వెంటనే అవి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీని వాసన మీఇంట్లో ప్రతికూలతను కూడా పోగొడుతుంది.

మిరియాల స్ప్రే

నల్ల మిరియాల పొడిని నీటిలో కలిపి స్ప్రే చేసి చేసినా కూడా బల్లులు ఒక్కటి కూడా లేకుండా పోతాయి. ఇందుకోసం బల్లులు తిరిగే ప్రదేశంలో దీన్ని  స్ప్రే చేయండి.

ఐస్ వాటర్

మీ ఇంట్లోకి బల్లి వస్తే దానిపై ఐస్ వాటర్ ను చల్లండి. పారిపోతుంది. అయితే ఈ చిట్కా వల్ల బల్లి ఎటూ పారిపోదు. దీంతో మీరు వీటిని సులువుగా బయట వేయొచ్చు. 

పరిశుభ్రత పాటించడం

బల్లులు మురికికి, కీటకాలకు బాగా ఆకర్షితులవుతాయి. కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. తినే పదార్థాలు, పానీయాలను తెరిచి ఉంచకూడదు. 

Find Next One