జామకాయను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే ఎంతో ఆరోగ్యం దక్కుతుంది. రోజూ తినడం వల్ల అజీర్తి లక్షణాలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
జామ కాయ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
జామ కాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
జామలో కేలరీలు చాలా తక్కువ. ఫైబర్, నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది.
జామలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే గుణం ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జామపండులో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
జామకాయలో ఉండే లైకోపీన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కలిపి క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది.
Hair Care:ఎండాకాలంలో జుట్టు పట్టుకుచ్చులా మెరవాలా? ఇలా చేస్తే చాలు
Colorful Beaded Necklace: కలర్‌ఫుల్ పూసల దండలు.. మెడ నిండుగా, అందంగా..
Kitchen Hacks: అయ్యో, ఉప్పు ఎక్కువైందా? క్షణాల్లో మ్యాజిక్ చేసే సూపర్ టిప్
Baby Gold Earrings: చిన్నారుల కోసం క్యూట్ గోల్డ్ టాప్స్.. చూడండి