Lifestyle

బరువును తగ్గించే కూరగాయలు

కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

క్యాబేజీ

క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. బరువును తగ్గించడంలో క్యాబేజీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
 

 

Image credits: Getty

బచ్చలికూర

బచ్చలికూర పోషకాల బాంఢాగారం. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  ఒక కప్పు బచ్చలికూరలో కేవలం 7 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
 

Image credits: Getty

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ కూరగాయ బెల్లీ ఫ్యాట్ ను బాగా తగ్గిస్తుంది. ఒక కప్పు ఉడికించిన కాలీఫ్లవర్ లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 

 

Image credits: Getty

బ్రోకలీ

బ్రోకలీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మరొక కూరగాయ. దీన్ని డైట్ లో చేర్చుకుంటే చాలా త్వరగా బరువు తగ్గుతారు. ఫైబర్ తో పాటుగా బ్రోకలీలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.
 

 

Image credits: Getty

కీరదోసకాయలు

కీరదోసకాయల్లో బరువు తగ్గడానికి సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కీరదోసకాయలను సలాడ్, స్మూతీ లేదా వేరే పద్దతుల్లో తినొచ్చు. ఇవి కూడా మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.
 

Image credits: Getty

చిలగడదుంప

చిలగడదుంపల్లో సోడియం తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Find Next One