Lifestyle

జీవక్రియను పెంచే భారతీయ ఆహారాలు

Image credits: Pexels

గ్రీన్ టీ

గ్రీన్ లో సహజ యాంటీఆక్సిడెంట్లు అయిన కాటెచిన్‌ ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గ్రీన్ టీ జీవక్రియ బూస్టర్‌గా ప్రఖ్యాతి పొందింది.

Image credits: Pexels

సుగంధ ద్రవ్యాలు

పసుపు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలను మన దేశంలో బాగా ఉపయోగిస్తారు. ఇవి ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి.
 

Image credits: Pexels

పప్పులు

పెసర పప్పు, మసూర్ పప్పు వంటి కాయధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇది జీవక్రియలో తాత్కాలిక పెరుగుదలకు దారితీస్తుంది.
 

Image credits: Pexels

తృణధాన్యాలు

శుద్ధి చేసిన గింజలకు బదులుగా బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ వంటి తృణధాన్యాలను తీసుకోండి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు నిరంతర శక్తిని అందిస్తాయి. కడుపును తొందరగా నింపుతాయి.
 

Image credits: Pexels

మిరపకాయలు

మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ పెరిగిన కేలరీలను బర్నింగ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే కొవ్వును కరిగిస్తుంది. మీ భోజనానికి మిరపకాయను జోడించడం వల్ల మీ జీవక్రియ మెరుగుపడుతుంది.
 

Image credits: Pexels

పెరుగు

పెరుగు అనేది ప్రోబయోటిక్-రిచ్ ఫుడ్. ఇది గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ మెరుగైన జీవక్రియ, బరువు నిర్వహణతో సంబంధం కలిగి ఉంటుంది.
 

Image credits: Pexels

జీలకర్ర

జీలకర్ర గింజలు భారతీయ వంటకాలలో ఒక సాధారణ మసాలా దినుసు. వీటిలో మన జీవక్రియను పెంచే లక్షణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.

Image credits: Pexels
Find Next One