Lifestyle

రోగనిరోధక శక్తి

పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. 
 

Image credits: Getty

రోగాల ముప్పు తక్కువ

పైనాపిల్ మన శరీరాన్ని వ్యాధులు, అంటువ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. పైనాపిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు,  ఫ్లూ లు తొందరగా తగ్గిపోతాయి. 
 

Image credits: our own

ఎముకల ఆరోగ్యం

పైనాపిల్ లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఎముకల నష్టం, బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షించే ముఖ్యమైన ఎంజైమ్లను ఉత్పత్తి చేయడానికి మాంగనీస్ మన శరీరానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

ఎముకల పగుళ్ల ప్రమాదం

పైనాపిల్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల మన ఎముక సాంద్రత పెరుగుతుంది. అలాగే ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా బాగా తగ్గుతుంది.
 

Image credits: Getty

కంటి ఆరోగ్యం

పైనాపిల్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన కంటిచూపును పెంచడంతో పాటుగా కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

కంటిశుక్లం ప్రమాదం

ఇది వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత, కంటిశుక్లం వంటి ప్రమాదాల్ని కూడా తగ్గిస్తుంది. పైనాపిల్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం  వల్ల కంటి సమస్యలొచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

Image credits: Getty

జీర్ణక్రియ

పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా పైనాపిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి.
 

Image credits: Getty
Find Next One