Lifestyle

బెర్రీలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జ్ఞాపకశక్తిని పెంచుతాయి

శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన  ఒక అధ్యయనం ప్రకారం.. స్ట్రాబెర్రీలను తింటే  జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ పండ్లు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
 

గుండె ఆరోగ్యం

స్ట్రాబెర్రీల్లో ఎన్నో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ పండ్లలో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, ఫైటోస్టెరాల్స్, పాలీఫెనాల్స్ వంటి గుండె-ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా స్ట్రాబెర్రీలు ఎంతో సహాయపడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రాబెర్రీలలో ఉండే జీవరసాయనం అల్జీమర్స్ చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

రక్తపోటు

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను పెంచుతుంది. అయితే స్ట్రాబెర్రీల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
 

వెయిట్ లాస్

ఊబకాయులకు, బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీలు ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ అతిగా తినడాన్ని తగ్గించి, ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 
 

కొవ్వు తగ్గుతుంది

స్ట్రాబెర్రీలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం స్ట్రాబెర్రీలను సలాడ్ గా, జ్యూస్ గా, స్మూతీగా డైట్ లో చేర్చుకోవచ్చు.
 
 

Find Next One