Lifestyle

పాలకూర సూప్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే పాలకూర సూప్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
 

Image credits: Getty

కాలీఫ్లవర్ రైస్


 కాలీఫ్లవర్ రైస్ లో కేలరీలు, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం పూట అన్నానికి బదులుగా దీన్ని తినొచ్చు.

Image credits: Getty

బ్రౌన్ రైస్

వైట్ రైస్ కంటె బ్రౌన్ రైస్ యే బెటర్ అని నిపుణులు చెప్తారు. ఎందుకంటే దీనిలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఈ రైస్ ఆకలిని నియంత్రిస్తుంది.  మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

 

Image credits: Getty

బార్లీ

బియ్యం కంటే బార్లీలోనే ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఇవి ఆకలిని త్వరగా తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

ఓట్స్

ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
 

Image credits: Getty

ఉప్మా

ఉప్మాను తింటే కూడా మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  కొవ్వు తక్కువగా ఉంటుంది.
 

Image credits: Getty

గింజలు

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే నట్స్ మీ కడుపును తొందరగా నింపుతాయి. మీకు అతిగా ఆకలి కానీయవు. అంతేకాదు ఇవి బరువును, అపానవాయువును తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

సలహా

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty
Find Next One