Lifestyle

తెల్ల వెంట్రుకలు

వయసుతో పాటుగా జుట్టు తెల్లబడటం సహజమే. అయినప్పటికీ చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వల్ల అందం తగ్గుతుంది. అలాగే పెద్ద వయసు వారిలా కనిపిస్తారు. 
 

Image credits: Getty

ఒత్తిడి

పిల్లల వెంట్రుకలు కూడా తెల్లబడటం ప్రస్తుత కాలంలో చూస్తూనే ఉన్నాం. ఒత్తిడి, పోషకాహార లోపం, జెనెటిక్స్ వంటి వివిధ కారణాల వల్ల వెంట్రుకలు తెల్లగా మారుతాయి. 
 

Image credits: our own

విటమిన్ బి 12

విటమిన్స్ లోపం వల్ల కూడా నల్ల వెంట్రుకలు తెల్లగా మారుతాయి. ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం ఉంటే చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా అవుతాయి. 
 

Image credits: our own

విటమిన్లు, ఖనిజాల లోపం

విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడమే కాదు.. నల్ల వెంట్రుకలు తెల్లగా మారుతాయి కూడా. 
 

Image credits: our own

థైరాయిడ్

థైరాయిడ్ రుగ్మతలు, రక్తహీనత వంటి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేలా చేస్తాయి. 
 

Image credits: our own

/i

గోరింటాకు, గుడ్లతో చేసిన హెయిర్ ప్యాక్ తెల్ల వెంట్రుకలను నల్లగా చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. మీకు తెల్ల జుట్టు ఉంటే ఈ ప్యాక్ లను ట్రై చేయండి.
 

Image credits: our own
Find Next One