నక్షత్రాల కింద అవుట్‌డోర్ లేదా ఇండోర్ మూవీ నైట్‌ని సెటప్ చేయండి. మీ భాగస్వామికి ఇష్టమైన మూవీని ప్లే చేయండి.అలాగే కొన్ని స్నాక్స్ ను కూడా ఏర్పాటు చేయండి.
Image credits: Freepik
అవుట్‌డోర్ అడ్వెంచర్
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, హైకింగ్ ట్రిప్ లేదా పిక్నిక్ తర్వాత మంచి బైక్ రైడ్ వంటి బహిరంగ సాహసంతో మీ ప్రియమైన వారిని ఆశ్చర్యపరచండి.
Image credits: Freepik
గిఫ్ట్
మెమోరీ స్క్రాప్‌బుక్, ఆభరణాలు లేదా ఫ్రేమ్డ్ ఫోటో కోల్లెజ్ వంటి బహుమతిని మీరే డిజైన్ చేయండి. ఇది మీ భాగస్వామిని ఎంతో ఆనందపరుస్తుంది.
Image credits: Freepik
విహారం
మీ భాగాస్వామిని మంచి రొమాంటిక్ ప్లేకు కూడా తీసుకెళ్లొచ్చు. ఈ న్యూ ఇయర్ వారాంతపు సెలవును ఇక్కడికి ప్లాన్ చేయండి. పర్వతాలలో హాయిగా ఉండే క్యాబిన్ లేదా బీచ్ రిసార్ట్ కావొచ్చు.
Image credits: Freepik
స్టార్‌లైట్ సాయంత్రం
నక్షత్రాలను చూసే రాత్రిని ఏర్పాటు చేయండి. ఇది మీ పెరట్లో కావొచ్చు లేదా అబ్జర్వేటరీలో అయినా కావొచ్చు. హాయిగా ఉండే దుప్పట్లు, వేడి పానీయాలతో ఈ రాత్రిని ఆస్వాధించండి.
Image credits: Freepik
మెమోరీ లేన్ డిన్నర్
మీకు ఇష్టమైన డేట్ లేదా మధురమైన క్షణాలకు మీరే ప్రత్యేకంగా వంటలను తయారుచేయండి. ఇది మరింత ఆహ్లాదకరంగా ఉండటానికి ఇంట్లో క్యాండిల్‌లైట్ టేబుల్‌ని సెటప్ చేయండి.