Lifestyle

మెదడు ఆరోగ్యం

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని నానబెట్టి తింటే మెదడు ఎదుగుదల బాగుంటుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. 
 

Image credits: others

గుండె ఆరోగ్యం

వాల్ నట్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని తింటే గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
 

Image credits: others

డయాబెటిస్

వాల్ నట్స్ డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నానబెట్టిన వాల్ నట్స్ ను తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. 
 

Image credits: others

కొలెస్ట్రాల్

వాల్ నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.
 

Image credits: others

గట్ ఆరోగ్యం

వాల్ నట్స్ లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: others

స్టామినా

ఇతర గింజలతో పోలిస్తే వాల్ నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి. 
 

Image credits: others

బరువు తగ్గడానికి

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. 
 

Image credits: others

చర్మ ఆరోగ్యం

వాల్ నట్స్ లో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే చర్మ సమస్యలు వచ్చే అకాశం తగ్గుతుంది. 
 

Image credits: others
Find Next One