నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మ్యూజిక్ యాప్ ఇలా మనం ఉపయోగించని చాలా వాటికి మనం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారు. వాటిని రద్దు చేసుకుంటే.. రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా చేసుకోవచ్చు.
వీకెండ్ లో టైమ్‌పాస్ కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తాము. ఈసారి అలా చేయకండి. కార్ట్‌లోని ఉత్పత్తులను తొలగించి, కేవలం అవసరం అయిన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి..
వీకెండ్ బయటకు వెళ్లినప్పుడు చాలా మంది బయటి ఫుడ్ తింటూ ఉంటారు. దాని వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. అలా కాకుండా, ఇంట్లోనే రుచికరమైన ఆహారం వండుకోండి. దీని వలన డబ్బు ఆదా అవుతుంది.
మీరు ప్రతి వారాంతంలో ఓలా లేదా ఉబెర్‌లో ప్రయాణిస్తే, ఈసారి మెట్రో, లోకల్ రైలు లేదా బస్సులో ప్రయాణించి చూడండి. మీరు ₹500-700 వరకు సులభంగా ఆదా చేసుకోవచ్చు.
మీరు ఈ 7 చిట్కాలను పాటిస్తే, ఒక్క వారాంతంలోనే ₹5,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదా చేయవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆదాలతో మీరు మంచి మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు.
ఈ వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇక్కడ ఇచ్చిన సలహా ఏ విధమైన ఆర్థిక సలహా కాదు. డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి.