Lifestyle
డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇది ప్రమాదకరమైన సమస్య.
చాలా మందికి డయాబెటీస్ ఉన్నా గుర్తించలేరు. అయితే కొన్నిలక్షణాలతో మీకు డయాబెటీస్ ఉందో? లేదో సులువుగా తెలుసుకోవచ్చు.
డయాబెటీస్ ఉంటే ఎలాంటి ప్రయత్నం చేయకున్నా చాలా తొందరగా బరువు తగ్గిపోతారు.
షుగర్ వ్యాధి ఉంటే కూడా ఎప్పుడూ అలసటగా ఉంటుంది. ఏ పనిచేయడానికి చేతకాదు.
డయాబెటీస్ ఉంటే కూడా గాయాలు త్వరగా నయం కావు. మీకు ఇలా అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
డయాబెటీస్ ఉంటే తరచుగా మూత్రానికి వెళుతుంటారు. దీంతో తరచుగా దాహం అవుతూనే ఉంటుంది.
డయాబెటీస్ వల్ల కంటిచూపుపై కూడా ప్రభావం పడుతుంది. డయాబెటీస్ ఉంటే కళ్లు సరిగ్గా కనిపించవు.
డయాబెటీస్ వల్ల చిగుళ్ల వ్యాధులు వస్తాయి. అలాగే యోని అంటువ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.