Telugu

పాస్ పోర్ట్ చాలు.. వీసా లేకుండానే మీరీ సుందర దేశాల్లో పర్యటించవచ్చు

ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లు వీసా లేకుండా వెళ్లగలిగే అందమైన దీవుల గురించి తెలుసుకుందాం.

Telugu

మారిషస్

అందమైన బీచ్‌లు, ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ఉష్ణమండల ప్రదేశం. ఇండియన్లు వీసా లేకుండా 90 రోజుల వరకు మారిషస్‌లో ఉండొచ్చు.

Image credits: Getty
Telugu

మోంటెస్సరాట్

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న కరేబియన్ దీవుల్లో ఒకటి. అద్భుతమైన నల్ల ఇసుక బీచ్‌లు, రంగురంగుల పగడపు దిబ్బలు, రాతి కొండలు, తీర గుహలు ఇక్కడి ప్రత్యేకతలు.

Image credits: Getty
Telugu

శ్రీలంక

దక్షిణాసియాలోని ఈ దేశం ప్రాచీన దేవాలయాలు, తేయాకు తోటలు, అందమైన తీరప్రాంత నగరాలతో పర్యాటకులకు అలరిస్తుంది. 

Image credits: Freepik
Telugu

సీషెల్స్

ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన ప్రయాణం కోరుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.  ప్రశాంతమైన బీచ్‌లు, సుసంపన్నమైన సముద్ర జీవులు ఇక్కడి ప్రత్యేకతలు.

Image credits: Getty
Telugu

సమోవా

ఓషియానియాలోని ఈ ద్వీప దేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. బీచ్‌లతో పాటు, వర్షారణ్యాలలో సాహసయాత్రను ఆస్వాదించవచ్చు

Image credits: Getty
Telugu

జమైకా

కరేబియన్ స్వర్గం. రెగె సంగీతం నుండి అద్భుతమైన జలపాతాల వరకు, ఇక్కడ చూడటానికి చాలా అందాలు ఉన్నాయి. గొప్ప సంస్కృతి, సహజ సౌందర్యం ఈ దేశం సొంతం. 

Image credits: Freepik
Telugu

బార్బడోస్

వెస్ట్ ఇండీస్‌లోని ఈ ద్వీప దేశం అందమైన బీచ్‌లు, ఉత్సవాలు, చారిత్రాత్మక ప్రదేశాలు,  వైవిధ్యమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.

Image credits: Getty
Telugu

కుక్ దీవులు

స్నార్కెలింగ్, డైవింగ్, స్థానిక సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను కలిగివుంటుంది..

Image credits: Pixabay
Telugu

బ్రిటిష్ వర్జిన్ దీవులు

సెయిలింగ్, డైవింగ్ చేయడానికి ... ఏకాంతంగా బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి ఇది సరైన ప్రదేశం. సహజ సౌందర్యం,  మంచి సౌకర్యాలు కలిగివుంటుంది..

Image credits: Pixabay
Telugu

మాల్దీవులు

దక్షిణాసియా దేశమైన మాల్దీవులు  ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. విలాసవంతమైన రిసార్ట్‌లను కలిగివుంది. ఇక్కడి తెల్ల ఇసుక బీచ్‌ల అందాలు మంత్రముగ్దుల్ని చేస్తాయి.

Image credits: Freepik
Telugu

నియూ దీవి

దక్షిణ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఒక చిన్న ద్వీప దేశం నియూ. ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బలు ఈ ద్వీపానికి ఆభరణాలుగా ఉన్నాయి.

Image credits: Getty

ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ బి లోపం ఉన్నట్లే

ప్రధాని ప్రారంభించిన శివాజీ విగ్రహం కూలిపోయింది. ఎందుకో తెలుసా

AI రీప్లేస్ చేయలేని 7 హై-ఇన్‌కమ్ జాబ్స్

హ్యాపీ హార్మోన్లు.. ఆనందాన్ని పంచే వీటిని ఎలా పెంచుకోవాలి?