Lifestyle
పరుగెత్తడం, నృత్యం లేదా చురుకైన నడక వంటి శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల "ఫీల్-గుడ్" హార్మోన్లుగా పిలువబడే ఎండార్ఫిన్ల విడుదల పెరుగుతుంది.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోబయోటిక్స్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు సెరోటోనిన్, డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్ల స్థాయిలను పెంచుతాయి.
సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల నియంత్రణకు తగినంత నిద్ర అవసరం. నిద్ర మీ శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. హ్యాపీ హర్మోన్ల విడుదలను పెంచుతాయి.
సూర్యకాంతికి సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి ఎండార్ఫిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ప్రకృతి ప్రశాంతత ప్రభావాలు సహజంగా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి
మైండ్ఫుల్నెస్, ధ్యానం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు సెరోటోనిన్-డోపమైన్ విడుదలను ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజువారి ధ్యానంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి.
బలమైన సామాజిక బంధాలను ఏర్పరచుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. "ప్రేమ హార్మోన్" గా పిలిచే ఇధి స్నేహితులు, కుటుంబం లేదా పెంపుడు జంతువులతో గడపడంతో విడుదలవుతాయి.
మీకు ఇష్టమైన సంగీతం వినడం వల్ల డోపమైన్, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. సంగీతం మీ మానసిక స్థితిని పెంచుతుంది, ఆందోళనను తగ్గించి ఆనందాన్ని కలిగిస్తుంది.