Lifestyle
డాక్టర్లు, సర్జన్ల నైపుణ్యాన్ని AI రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే రోగి ఆరోగ్యాన్ని కాపాడే సమయంలో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
సామాజిక కార్యకర్తల సేవలు మరువలేనివి. స్నేహ పూర్వకంగా వారు చేసే సాయాన్ని AI చేయలేదు.
ఉపాధ్యాయులే విద్యార్థులకు హీరోలు. ఎందుకంటే వారే పిల్లలకు స్ఫూర్తినిస్తారు. AI పాఠాలు మాత్రమే చెబుతుంది. సృజనాత్మకతను పెంపొందించలేదు.
సంగీతకారులు తమ ప్రదర్శనల ద్వారా లోతైన భావోద్వేగాలను వ్యక్త పరుస్తారు. AI మ్యూజిక్ మాత్రమే క్రియేట్ చేయగలదు. భావ వ్యక్తీకరణ చేయలేదు.
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు చాలా ఓపిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. వినియోగదారుల సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాల్సి ఉంటుంది. AI సమస్యలను రికార్డ్ మాత్రమే చేయగలదు.
శాస్త్రవేత్తలు తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేస్తారు. AI పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు.
సైకియాట్రిస్టులు వివిధ కోణాల్లో రోగిని ప్రశ్నించి మానసిక ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. చికిత్స చేస్తారు. AIకి ఆ సామర్థ్యం ఉండదు.