బంగారు గొలుసు, నల్లపూసల కాంబినేషన్ లో.. అందమైన పెండెంట్ చేర్చి తయారు చేసిన బ్రేస్లేట్స్.. చేతులకు అందాన్ని తెస్తాయి. మీ లుక్ ని ట్రెండీగా కూడా మారుస్తాయి.
డైమండ్ ఫ్లవర్ డిజైన్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్. ఈ బ్రేస్‌లెట్‌లో నల్ల పూసలతో పాటు గోల్డ్ ఫ్లవర్ పెండెంట్, చిన్న డైమండ్స్ లేదా స్టోన్స్ ఉంటాయి. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈ ఇన్ఫినిటీ స్టైల్ గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్.. యానివర్సరీ, పార్టీ, పండుగలకు అద్భుతమైన ఎంపిక. దీని సింపుల్ ఫినిషింగే దీని ప్రత్యేకత. ఇలాంటి డిజైన్‌ను ఒక్కసారైనా ప్రయత్నించండి.
హార్ట్-షేప్ డైమండ్ పెండెంట్‌తో ఉండే గోల్డ్ బ్రేస్‌లెట్ మంగళసూత్రం ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది. ఇందులో చిన్న డైమండ్స్, నల్ల పూసలు, బంగారు గొలుసు కలిసి ప్రీమియం లుక్ ఇస్తాయి.
ఆఫీస్, క్యాజువల్ దుస్తులతో ఈ మంగళసూత్ర బ్రేస్‌లెట్ కడా డిజైన్ సులభంగా మ్యాచ్ అవుతుంది. దీన్ని మీరు పార్టీ వేర్‌గా చీరలు, సూట్లు, లెహంగాలతో కూడా ధరించవచ్చు.
సింపుల్, ఎలిగెంట్ జ్యువెలరీ ఇష్టపడేవారికి, సన్నని గోల్డ్ చైన్‌పై నల్ల పూసలు ఉన్న ఈ మినిమల్ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో చిన్న గోల్డ్ మోటిఫ్ లేదా డైమండ్ పెండెంట్ ఉంటుంది.
ఇన్ఫినిటీ ప్యాటర్న్ ఎల్లప్పుడూ విడదీయరాని బంధానికి చిహ్నం. గోల్డ్ నేమ్ లెటర్, నల్ల పూసలతో చేసిన ఈ బ్రేస్‌లెట్ మంగళసూత్రం ట్రెండీగా ఉంటుంది. దీన్ని ప్రత్యేక సందర్భాలలో స్టైల్ చేయండి