Almond Oil: ఇది డైలీ వాడితే జుట్టు పెరుగుతుంది..ముఖం నిగారిస్తుంది
life Jul 15 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
చర్మ తేమను కాపాడుతుంది (Moisturization)
బాదం నూనెలో ఒమెగా 9, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను బయటకు పోకుండా లాక్ చేస్తాయి. ఇది ఒక సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, చర్మాన్ని లోతుగా పోషిస్తుంది.
Image credits: Pixabay
Telugu
పొడి చర్మానికి (Dry Skin) చెక్
మీ చర్మం మరీ పొడిగా ఉన్నా లేదా పొరలుగా ఊడిపోతున్నా, రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె రాయండి. ఇది చర్మం పొడిబారకుండా చేసి, మృదువుగా మారుస్తుంది.
Image credits: our own
Telugu
నల్లటి వలయాలకు (Dark Circles) గుడ్ బై
కళ్ల కింద నల్లటి వలయాలతో విసిగిపోయారా? బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ.. కళ్ల కింద నల్లటి మచ్చలను తొలగించి, ఆ ప్రాంతంలోని చర్మానికి కొత్తదనాన్ని ఇస్తుంది.
Image credits: Pixabay
Telugu
మృదువైన పెదాల కోసం (Soft Lips)
పగిలిన పెదాలపై ఉన్న మృత కణాలను (Dead Skin) తొలగించి, పెదాలను సహజంగా గులాబీ రంగులో మృదువుగా మారుస్తుంది.
Image credits: pexels
Telugu
ఎలా వాడాలి?
రాత్రి ముఖం కడుక్కున్న తర్వాత, 2 చుక్కల బాదం నూనెను అరచేతిలో వేసి రుద్దండి. తర్వాత ముఖానికి తేలికగా మసాజ్ చేయండి. ఫలితం కనిపించాలంటే స్వచ్ఛమైన బాదం నూనెనే వాడండి.