Health
నేషనల్ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం 2 టేబుల్ స్పూన్ల చియా గింజల్లో ఫైబర్: 10 గ్రాములు, కొవ్వు:4 గ్రాములు, ప్రోటీన్:4 గ్రాములు, కాల్షియం:9 గ్రాములు పోషకాలుంటాయి.
పోషకాలు పుష్కలంగా ఉండే చియా గింజలను ఒక రోజుకు 15 నుంచి 30 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. వ్యక్తి ఆరోగ్యం, లింగం, వయస్సు, ఆహార అవసరాలను బట్టి ఇది మ ారుతుంది.
డయాబెటిస్ పేషెంట్లు రోజూ చియా గింజలను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగేగుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
జర్నల్ ఆఫ్ అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ ప్రకారం.. 25 గ్రాముల చియా గింజలను 12 వారాల పాటు రోజూ తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం.. చియా గింజలు రక్తపోటును నియంత్రిస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఈ గింజలను ఎవరైనా తినొచ్చు.
చియా గింజలను లిమిట్ లోనే తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఎక్కువగా తింటే ఉబ్బరం లేదా కడుపు నొప్పి వస్తుంది.
చియా గింజలను మీరు స్మూతీలో లేదా నీళ్లు-తేనెతో కలిపి తాగొచ్చు. పిల్లలకు పెరుగుతో కలిపి ఇవ్వొచ్చు.