Food

మొటిమలను తగ్గించే పండ్లు ఇవి

Image credits: freepik

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు వంటి బెర్రీలు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మొటిమలు తగ్గుతాయి. 

 

Image credits: Pixabay

ఆపిల్

ఆపిల్‌ పండ్లలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించి మొటిమలను తగ్గిస్తాయి. 

 

Image credits: Pixabay

నారింజ

నారింజ పండ్లు విటమిన్ సికి గొప్ప మూలం. ఇది వాపును తగ్గించడానికి, మొటిమలను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Pixabay

పైనాపిల్

పైనాపిల్ లో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది మొటిమలకు సంబంధించిన ఎరుపు, వాపును తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

Image credits: Pixabay

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, పాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి.

Image credits: Pixabay

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇది మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. 

Image credits: Pixabay

కివీ

కివీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను,  వాపును తగ్గిస్తాయి.

Image credits: Pixabay

పరగడుపున కలబంద జ్యూస్ తాగితే ఏమౌతుంది?

పసుపు పాలు రోజూ తాగితే ఏమౌతుంది?

పాము గుండె, బాతు పిండం, గబ్బిలాల కూర : ప్రపంచంలో 10 విచిత్రమైన ఆహారాలు

పెసరుపప్పు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా..!!