Lifestyle

రక్తపోటును తగ్గించే చిట్కాలు

విశ్రాంతి, లోతై శ్వాస

ఒత్తిడి రక్తపోటును బాగా పెంచుతుంది.  అందుకే ఒత్తిడి తగ్గడానికి ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి. అలాగే నెమ్మదిగా, లోతైన శ్వాస తీసుకోండి. శ్వాసపై దృష్టి పెట్టండి. 

హైడ్రేటెడ్ గా ఉండండి

నిర్జలీకరణం కూడా రక్తపోటును పెంచుతుంది. అందుకే నీళ్లను పుష్కలంగా తాగండి. శరీరంలో హైడ్రేట్ గా ఉంటే మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 
 

సోడియం

అధిక రక్తపోటు పేషెంట్లు ఉప్పును ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఉప్పును తీసుకోవడాన్ని తగ్గిస్తే తాత్కాలికంగా రక్తపోటు తగ్గుతుంది. 

బరువు

అధిక బరువు కూడా అధిక రక్తపోటు సమస్యను పెంచుతుంది. అందుకే బరువు తగ్గడానికి రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. బరువు తగ్గితే రక్తపోటు తగ్గడమే కాకుండా రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. 

కెఫిన్

కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఎక్కువగా వాటిని తీసుకుంటే రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది. అందుకే కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకండి. 
 

తులసి నీటిని రోజూ తాగడం అలవాటు చేసుకుంటే మీకు ఈ సమస్యలే రావు..!

చిలగడదుంపలను రోజూ తింటున్నరా?

బరువు తగ్గడానికని నడుస్తున్నారా? ఇదొక్కటే చాలదు.. అవి కూడా అవసరమే..!

ఉదయపు తలనొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు