Lifestyle

జీర్ణం

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే చిలగడదుంపలు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి.
 

 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

చిలగడదుంపల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని రెగ్యులర్ గా తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty

డయాబెటిస్ మెల్లిటస్

మధుమేహులు కూడా చిలగడదుంపలను తినొచ్చు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫైబర్ కూడా ఉంటుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది.
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

చిలగడదుంపల్లో విటమిన్ బి6, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
 

Image credits: Getty

కళ్ల ఆరోగ్యం

విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు పుష్కలగా ఉన్న చిలగడదుంపలు కూడా కళ్ల ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఇవి కంటిచూపును పెంచడానికి కూడా సహాయపడతాయి.
 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

చిలగడదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

చిలగడదుంపలు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తింటే కడుపు తొందరగా నిండుతుంది. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
 

Image credits: Getty
Find Next One